Related Posts

32 thoughts on “7 AM | ETV Telugu News | 15th April 2019

 1. ఈవీఎం కోడ్ మార్చేశారు అంటున్నాడు హరిప్రసాద్… కోడ్ మార్పు ఏదో కుట్రకు సంకేతంగా భావించినప్పుడు నోటిఫికేషన్‌కు ముందే తమ డౌట్లు నివృత్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఎందుకు ఆశ్రయించలేదు..? భెల్‌కు పంపించి, ఎవరో ఔట్ సోర్సింగు వాళ్లతో చిప్స్ మార్పించేశారు అంటాడు చంద్రబాబు, పార్టీలకు చెప్పకుండా ఎలా పంపిస్తారు అని కస్సుమంటున్నాడు… వాటి తయారీ, రిపేర్లు అన్నీ సదరు సంస్థే చేస్తుంటుంది, అది నిరంతరం జరిగే కార్యక్రమం… ఎప్పుడూ దేశంలో ఏదో ఎన్నిక జరుగుతూనే ఉంటుంది… ప్రతి ఈవీఎం రిపేరుకూ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్షాన్ని పిలిచి, సంతకాలు తీసుకోవాలా..?

  2017లో ఎన్నికల సంఘం ఒక సవాల్ విసిరింది… బహిరంగంగా తమ ఈవీఎంను హ్యాక్ చేసి చూపించాలనీ, అనవసర ప్రచారాలు వద్దని ప్రకటించింది… ఇదే తెలుగుదేశం గానీ, ఇప్పుడు గాయిగత్తర చేస్తున్న దాని మిత్రపక్షాలు గానీ, అదే ఢిల్లీలో రాజరికం వెలగబెట్టే ఆప్ గానీ, తన హయాంలోనే ఈవీఎంలతో ఎన్నికల్ని నిర్వహింపజేసుకున్న కాంగ్రెస్ గానీ హాజరు కాలేదు… నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం మాత్రమే హాజరయ్యాయి… అవీ జస్ట్, ఈసీ ప్రదర్శించిన ఓ 4 గంటల ఈవీఎం సినిమా చూసి వెళ్లిపోయాయి… సదరు ఈవీఎం వ్యతిరేక పోరాటయోధుడు అప్పుడు ఏం చేస్తున్నాడు..? చంద్రబాబు విసిరిన ఈ-పాస్ మిషన్లు, ఫైబర్ ప్రాజెక్టు, ఇతరత్రా ఐటీ ప్రాజెక్టు పనుల్లో కాసులు ఏరుకునే పనిలో ఉన్నాడా..? ఇదే చంద్రబాబు నిద్రపోయాడా..? 2010 నుంచీ జాతి ప్రయోజనాల కోసం ఈవీఎం వ్యతిరేక పోరాటం చేస్తూ, చోరీ చేయటానికీ సాహసించి, హ్యాక్ చేసి చూపించిన సదరు వేమూరివారు ఆ రోజు ఎందుకు సైలెంటుగా ఉండిపోయాడు..?

  ఇవన్నీ సరే, కామన్ సెన్స్ కోణంలో… నిజంగానే ఈవీఎంలను మోడీ ప్లస్ తన మిత్రపక్షాలు ట్యాంపర్ చేస్తున్నారనే విమర్శలే నిజమైతే… ఇదే మోడీ పార్టీ గత రెండేళ్లలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను కోల్పోలేదు..? అదెలా..? గోవాలో చావు తప్పి కన్నులొట్టబోయింది, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ ఎందుకు పోగొట్టుకుంది…? అంతెందుకు..? టీఆర్ఎస్ కూడా ఏదో కుట్ర చేసింది అనే ఆరోపణలున్నయ్… అదే నిజమైతే ఖమ్మం జిల్లాలో ఒకటే గెలుచుకుని ఎందుకు ఎడ్డిమొహం వేసినట్టు..?!

  ట్యాంపరింగు లేదు, కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్సే అనుకుందాం… తెలంగాణలో బాగానే ఆనందంగా పనిచేసిన ఈవీఎంలు కలిసికట్టుగా ఏపీలోనే ఎందుకు మొరాయించినట్టు..? వాటికి కృత్రిమ మేధస్సు ఏమైనా జోడించారా..? హరిప్రసాద్ చెప్పిన కోడ్ మార్పు అదేనా..? ఆ మేధస్సుతోనే అవి వైసీపీ బూతుల్లో బాగా పనిచేసి, టీడీపీ బూతుల్లో అవస్థల్ని క్రియేట్ చేశాయా..? ఈ ఫెయిల్యూర్లే అసలు సమస్య అయితే పోలింగు నుంచి బయటికి వచ్చిన ఒక్క టీడీపీ నాయకుడు ఆరోజు మాట్లాడలేదేం..? టీడీపీకి వ్యతిరేకంగా ఈ ఈవీఎం కుట్రలే నిజమైతే, మరి 130 గెలవబోతున్నాం అనే ప్రకటన ఎలా వస్తున్నట్టు..? ఓహ్… పసుపుకుంకుమ ఈవీఎంలలోని ఆ వైరస్‌ను కట్టడి చేసి, చంద్రబాబును ఆశీర్వదించిందా…? బాగు బాగు….

 2. వోట్ల యంత్రం… ఒక్క తెలుగుదేశాన్నే ఎందుకు వణికిస్తున్నది..?!

  వేమూరి హరికృష్ణ ప్రసాద్… చంద్రబాబు ఐటీ అడ్వయిజర్.., తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పలు లాభదాయక ప్రాజెక్టులు తీసుకుని బదనాం కూడా అయ్యాడు… మొన్నటి డేటాచోరీ ఐటీ గ్రిడ్ స్కాం సందర్భంగా తెరపైకి వచ్చి, నిందితులకు అండగా, తెలంగాణ సర్కారుపై ఎదురుదాడికి దిగాడు… ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు… ఎన్నికల సంఘంపై దాడికి వెళ్లిన టీడీపీ టీంలో తనూ ఉన్నాడు… ఫోఫోవోయ్, ఈవీఎం దొంగవు, నీతో మాట్లాడేదేమిటి..? ఛల్ హట్ అని ఎన్నికల సంఘం తనను పక్కనపెట్టేసింది… అదుగో అక్కడ తెలుగుదేశం బాగా హర్టయిపోయింది… అంతకుమించి ఆంధ్రజ్యోతి, ఈనాడు విపరీతంగా హర్టయిపోయాయి… మా హరిప్రసాద్ దొంగా..? అసలు ఆయన ఎంత ఉత్కృష్టుడో తెలుసా..? అన్నట్టుగా ఈరోజు రెచ్చిపోయాయి… ఈనాడు అయితే ఇప్పుడు ఈవీఎం తప్ప దేశంలో ఇంకో సమస్యే లేదు అన్నట్టుగా పిచ్చిపిచ్చిగా కథనాలు కుమ్మేసింది… సదరు హరిప్రసాద్ ఇంటర్వ్యూ, ముప్పావు పేజీ… అసలు ఈవీఎంతో ఎంత భయమో తెలుసా? అంటూ మరో హాఫ్ పేజీ ప్రత్యేక సొంత కథనం… బాబు గారేం సెలవిచ్చారో యథాతథంగా మరో ముప్పావు పేజీ… ఇలా… ఇక ఆంధ్రజ్యోతి గురించి చెప్పేది ఏముంది..? జజ్జనక జజ్జనక… మొత్తం అన్నీ చదివితే ఓ సగటు మనిషికి వచ్చే ప్రశ్నలకు కూడా ఈ రెండు మీడియా సంస్థలూ జవాబులు ఇవ్వాలి… కేవలం మా బాబు చెబుతున్నాడు, మేమూ ఘటవాయిద్యాలం అవుతాం అనే ధోరణి కాదు…

  ఇదే ఈవీఎంలపై చంద్రబాబు అనుసరిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ ఎలాంటివో ‘ముచ్చట’ నిన్న సవివరంగా చెప్పింది… ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం… తెలుగుదేశం శిబిరం బాగా మెచ్చేసుకుంటున్న సదరు వేమూరి హరిప్రసాద్ 2010లో ఒక ఈవీఎంను చోరీ చేశాడు… అదీ కేసు… దానికి తనేమంటున్నాడు..? నో, నో, నేను ఓ డమ్మీ మిషన్ తయారుచేసి ఎలా హ్యాక్ చేయాలో చూపించాను, కాదు, ఈ రియల్ మిషన్ హ్యాక్ చేసి చూపించు అని ఓ అధికారి తీసుకొచ్చాడు, తరువాత దాన్ని తీసుకుపోయాడు, నాదేం తప్పు అంటున్నాడు… అయ్యా, మరి తమరు హ్యాక్ చేసి చూపిస్తున్నప్పుడు, ఇది ఎన్నికల సంఘం ఉపయోగించే ఓ రియల్ మిషన్, ఎవరో తెచ్చి సవాల్ చేస్తే, ఇలా చేసిచూపిస్తున్నాను అని అప్పుడు చిత్రీకరించిన వీడియోలో డిస్‌క్లయిమర్ ఎందుకు చెప్పలేదు..? ఇన్నేళ్లూ దాన్ని ఎందుకు వెల్లడించలేదు…

  సరే, వేమూరిపై కేసు ఓ కుట్ర అనుకుందాం… ఇప్పుడు ఎన్నికల సంఘం తనను ఛీత్కరించడం కరెక్టు కాదు అనుకుందాం… తను దొంగే, కానీ ఒక దొంగ లేవనెత్తే అంశాలకు సమాధానాలు చెప్పే తెలివి, దమ్ము లేవా ఎన్నికల సంఘానికి అనే వాదన కూడా రీజనబులే అనుకుందాం… కానీ ఇక తెలుగుదేశంలో, ఈ దేశంలో ఈవీఎం కోడ్ గురించి, చిప్ గురించి, హ్యాకింగు గురించి మాట్లాడేవాళ్లే లేరా..? మోడీ వ్యతిరేక పక్షాల్లో ఒక్క పార్టీకి కూడా ఓ ఐటీ నిపుణుడినీ తీసుకొచ్చే స్థాయి లేదా..? అసలు నిన్నటి ఢిల్లీ బాబు షోను సోకాల్డ్ మమత, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, స్టాలిన్, దేవెగౌడ ఎట్సెట్రా లీడర్లు అంత లైట్ తీసుకున్నారేం..? ఒక్క తెలుగుదేశాన్నే ఎందుకు వణికిస్తున్నది ఈ సమస్య..? అంతెందుకు..? చంద్రబాబు మిత్రుడు పవన్ కల్యాణే దీనిపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *